venkatesh: అనిల్ రావిపూడికి మళ్లీ ఓకే చెప్పిన వెంకటేశ్

షార్ట్స్‌లో చూడండి
వెంకటేశ్ కి కథ చెప్పి ఒప్పించడం అంత తేలికైన విషయం కాదనే మాట ఫిల్మ్ నగర్లో వినిపిస్తూ ఉంటుంది. కథను పూర్తిగా వినేసి .. ఆ కథకి సంబంధించిన .. పాత్ర పరమైన సందేహాలను తీర్చుకున్న తరువాత ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. అందుకే కథ చాలా వరకూ పెర్ఫెక్ట్ గా వచ్చిందని అనుకున్న తరువాతనే దర్శకులు ఆయనని కలుస్తుంటారు.

అలాంటి వెంకటేశ్ కి లైన్ చెప్పేసి ఆయనతో ఓకే చెప్పించుకున్న ఘనత దర్శకుడు అనిల్ రావిపూడికి దక్కింది. 'ఎఫ్ 2' షూటింగు సమయంలోనే వెంకటేశ్ కి అనిల్ రావిపూడి ఒక లైన్ చెప్పాడట. లైన్ బాగుంది .. పూర్తి కథను సిద్ధం చేసుకుని రమ్మని వెంకటేశ్ అన్నట్టుగా సమాచారం. 'ఎఫ్ 2' విడుదల తరువాత వెంకటేశ్ సినిమాకి సంబంధించిన పూర్తి కథపై దృష్టి పెట్టాలనే ఆలోచనలో అనిల్ రావిపూడి వున్నాడని అంటున్నారు. ఈ లోగా వెంకటేశ్ 'వెంకీ మామ'ను పూర్తిచేసేస్తాడన్న మాట.
Go Back to Shorts
venkatesh

More Telugu News