50 ఏళ్ల మహిళలా కనిపించేందుకు జుట్టుకు గ్రే కలర్ డై వేసుకుని అయ్యప్ప ఆలయంలోకి వెళ్లా!: 36 ఏళ్ల దళిత మహిళ ప్రకటన
- ఫొటోతో సహా పోస్టు చేసిన మంజు
- గతేడాది విఫలయత్నం
- శబరిమలలో మరో కలకలం
తాను పోలీసు రక్షణ కోరలేదని, ఇతర భక్తులతో కలిసే వెళ్లానని ఆమె రాసుకొచ్చింది. 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకున్నట్టు చెప్పింది. కాగా, గత అక్టోబరులో ఆలయంలోకి వెళ్లేందుకు విఫలయత్నం చేసిన 20 మంది మహిళలలో మంజు కూడా ఒకరు కావడం గమనార్హం. విషయం తెలిసిన ఆందోళనకారులు కొల్లాంలోని ఆమె ఇంటిపై అప్పట్లో దాడి చేశారు. తాజాగా మంజు ఫేస్‌బుక్ పోస్టుతో మరోమారు కలకలం రేగింది.