అనుమతి లేకుండా తనని వీడియో తీసినందుకు యువతి ఫిర్యాదు.. నిందితుడి అరెస్టు
- బాధితురాలు వాణిజ్య ప్రకటనల నటి
- అంధేరి రైల్వేస్టేషన్లో నిల్చుని ఉండగా ఘటన
- రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
అయితే, ఆమె అనుమతి లేకుండా తన సెల్‌ఫోన్‌లో ఆమెను వీడియో తీశాడు. దీనిని గమనించిన ఆ యువతి అక్కడే ఉన్న కొందరి సహకారంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి ఫోన్ పరిశీలించగా ఆమెను వీడియో తీసినట్లు తేలింది. ఇలా అతను పలువురిని వీడియోలు తీసి ఇతరులకు వాటిని షేర్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు భూషణ్ నాయక్‌పై ఐపీసీ సెక్షన్ 354సీ, 509 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతని ఫోన్ ను సీజ్ చేశారు.