థియేటర్స్ లోనే 'కథానాయకుడు' చూడమంటోన్న బాలకృష్ణ
Add ap7am to your home Screen

థియేటర్స్ లోనే 'కథానాయకుడు' చూడమంటోన్న బాలకృష్ణ

  • రేపే థియేటర్లకు 'కథానాయకుడు'
  • ఆత్రుతను కనబరుస్తోన్న అభిమానులు 
  • పైరసీని అరికట్టమంటోన్న బాలయ్య  
బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా క్రిష్ దర్శకత్వంలో నిర్మితమైన ఎన్టీఆర్ 'కథానాయకుడు' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఒక వీడియో వదిలారు. "అందరికీ నమస్కారం .. ఎన్టీఆర్ 'కథానాయకుడు' రేపు 9న విడుదల కాబోతోంది. అందరూ థియేటర్లకు వెళ్లి చూడండి ..  పైరసీని అరికట్టండి" అని చెప్పారు.

నందమూరి అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ పోషించిన వివిధ పాత్రల్లో బాలకృష్ణ ఎలా కనిపించనున్నారు? రకరకాల గెటప్పులతో ఆయన ఎలా మెప్పించనున్నారు? అనేది తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఆయా పాత్రల్లో విద్యాబాలన్ .. రకుల్ .. నిత్యామీనన్ .. హన్సిక .. రానా .. సుమంత్ .. కల్యాణ్ రామ్ ఎలా ఒదిగిపోయారనేది చూడటానికి ఆత్రుతను కనబరుస్తున్నారు. 
balakrishna
rakul
nithya
hansika

More Telugu News