ఉద్యోగం ఇప్పిస్తానని మహిళా కార్యకర్తను రేప్ చేసిన బీజేపీ నేత!

  • ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఘటన
  • బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ నిర్వాకం
  • కొరడా ఝుళిపించిన బీజేపీ అధిష్ఠానం
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన ఓ రాజకీయ నేత సొంత పార్టీకి చెందిన మహిళా కార్యకర్తపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో చోటుచేసుకుంది. దీంతో అతనిపై ఆగ్రహించిన పార్టీ యాజమాన్యం బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఇక్కడి బల్బీర్ రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే తనపై లైంగికదాడి చేశాడని వాపోయింది.

ఈ ఘటన మీడియాలో రావడంతో సంజయ్ ను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆందోళనకు దిగింది. మరోవైపు బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Uttarakhand
BJP
leader
rape
party worker
Police
case

More Telugu News