బాల‌కృష్ణ‌కు నాగబాబు కౌంటర్ పై.. ట్విట్టర్ లో స్పందించిన రామ్ గోపాల్ వర్మ!
Add ap7am to your home Screen

బాల‌కృష్ణ‌కు నాగబాబు కౌంటర్ పై.. ట్విట్టర్ లో స్పందించిన రామ్ గోపాల్ వర్మ!

  • కామెంట్లు పెట్టడంలో నన్ను మించిపోయారు
  • మెగా బ్రదర్స్ ను మేం కూడా మీలాగే ప్రేమిస్తున్నాం
  • నాగబాబుకు హాట్సాఫ్ చెప్పిన దర్శకుడు
మెగాస్టార్ కుటుంబంపై గతంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌  చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు ప్రస్తుతం వీడియోలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు వీడియోలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

ట్విట్టర్ లో వర్మ స్పందిస్తూ.. ‘కామెంట్లు చేయ‌డంలో న‌న్ను మించిపోయార‌నే నా బాధ ఒక‌వైపు.. త‌న స్టార్ బ్ర‌ద‌ర్స్‌ను స‌మ‌ర్థించ‌డంలో సూప‌ర్‌స్టార్ అయిపోయార‌న్న ఆనందం మరోవైపు.. ఒక కంట క‌న్నీరు, మ‌రో కంట ప‌న్నీరు. నాగ‌బాబు గారూ హ్యాట్సాఫ్‌.. మీ సోద‌రుల‌ను మీరు ఎంత‌గా ప్రేమిస్తున్నారో మేం కూడా అంతే ప్రేమిస్తున్నాం` అని ట్వీట్ చేశారు.
Balakrishna
ram gopal varma
nagababu
Twitter

More Telugu News