మహిళలను తీసుకోవాలంటే మీటూ భయం వెంటాడుతోంది: మలయాళ దర్శకుడు లాల్ జోస్
- ఇది మంచా, చెడా అన్నది నేను చెప్పడం లేదు
- ఉద్యమం ఓ విధమైన అభద్రతకు కారణమైంది
- ఎప్పుడు ఎవరు ఎలా వ్యవహరిస్తారో అన్నదే ఆ భయం
సినీ ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం సృష్టించిన ప్రకంపనలు తెలిసిందే. పలువురు సెలబ్రిటీలపై విమర్శల జోరు ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపింది. ఇటీవల కాలంలో ఈ ఉద్యమం కాస్త చల్లబడిందనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లాల్‌జోస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'ఇరవై ఏళ్ల క్రితం సెట్స్‌లో నా ప్రవర్తన బాగాలేదని ఓ పాప్యులర్ లేడీ ఫొటోగ్రాఫర్ ఆరోపించారు. ఆ తర్వాత అది నిజం కాదని తేలింది. ఇప్పుడు మీటూ ఉద్యమం కూడా అటువంటి భయాన్నే ఇండస్ట్రీలో క్రియేట్ చేసింది' అని చెప్పారు జోస్. ఈ భయం మంచికా? చెడుకా? అన్నది తాను చెప్పలేనని అన్నారు.