Katrina: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  మహేశ్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందే చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ను సంప్రదించారని, ఆమె ఓకే చెప్పిందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తోంది.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ లభించింది. ఈ నెల 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
*  ప్రముఖ హాస్య నటుడు ఏవీయస్ తనయుడు రాఘవేంద్ర ప్రదీప్ దర్శకుడిగా మారాడు. తొలి ప్రయత్నంగా 'వైదేహి' పేరిట ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
Go Back to Shorts
Katrina
Mahesh Babu
Venkatesh
Varun

More Telugu News