అగ్రిగోల్డ్ ఎఫెక్ట్.. మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయిన ఏజెంట్!
- ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో ఘటన
- పెట్టుబడులపై ప్రశ్నించిన ప్రజలు
- గుండెపోటుతో మృతిచెందిన తాతారావు
విశాఖపట్నం జిల్లా నాగులపల్లికి చెందిన తాతారావు అగ్రిగోల్డ్ ఏజెంట్ గా పనిచేశారు. అప్పట్లో తనకున్న పరిచయాలతో చాలామంది చేత పెట్టుబడులు పెట్టించారు. చివరికి ఆ సంస్థ చేతులు ఎత్తేయడంతో బాధితులు తాతారావును ప్రశ్నించడం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో మనస్తాపానికి లోనైన తాతారావుకు ఈరోజు ఉదయం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తాతారావు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.