కేటీఆర్‌తో ప్రకాశ్ రాజ్ భేటీ.. తనకు రాజకీయ స్ఫూర్తి ఆయనేనన్న నటుడు!
- రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన మరునాడే భేటీ
- కేటీఆరే తనకు స్ఫూర్తి అంటూ ట్వీట్
- ఒక్కరి మీద పోరాటానికి కాదన్న నటుడు
కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఆయనతో దిగిన ఫొటోను ప్రకాశ్ రాజ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. తన రాజకీయ ప్రవేశానికి కేటీఆరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. తనకు స్పూర్తిదాయక మద్దతు ఇచ్చినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కొందరిమీద పోరాటానికి తాను రాజకీయాల్లోకి రావడం లేదని, సమాజం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు. ఇక నుంచి తన పోరాటాన్ని పార్లమెంటులోనూ కొనసాగిస్తానని ట్వీట్‌లో ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.