azharuddin: టీఆర్ఎస్‌లో చేరికపై అజారుద్దీన్ వివరణ

షార్ట్స్‌లో చూడండి
తాను టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ అజారుద్దీన్ స్పందించారు. అజారుద్దీన్ టీఆర్ఎస్‌లో చేరి సికింద్రాబాద్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నారని, ఈ మేరకు రంగం సిద్ధమైందంటూ రెండు రోజులుగా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. కాంగ్రెస్‌కు ఇది పెద్ద షాకేనంటూ వార్తలు హల్‌చల్ చేశాయి.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుమార్తె వివాహానికి హాజరైన అజారుద్దీన్ టీఆర్ఎస్‌లో చేరికపై చర్చించినట్టు పుకార్లు షికారు చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అజర్‌కు పచ్చజెండా ఊపినట్టు వార్తలు వచ్చాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ పుకార్లకు అజారుద్దీన్ తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టారు. తాను టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
azharuddin
Congress
TRS
KCR
Secunderabad

More Telugu News