vidyabalan: విద్యాబాలన్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ నుంచి స్పెషల్ పోస్టర్

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటిభాగమైన 'కథానాయకుడు' విడుదలకి ముస్తాబవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీమతి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించారు. ఆ పాత్రకి ఆమె నిండుదనాన్ని తీసుకొచ్చారు. ఈ రోజున ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బసవతారకం లుక్ తో వున్న విద్యాబాలన్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. "వెండితెర తారకమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దివిలోని తారకరాముల తరఫున .. భువి పైన తెలుగువారందరి తరఫున .." అంటూ క్రిష్ ట్వీట్ చేశారు. ఇక తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో పోస్టర్ ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ బయోపిక్ పై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. జనవరి 9న రానున్న 'కథానాయకుడు' సంచలనానికి తెరతీయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది
Go Back to Shorts
vidyabalan

More Telugu News