ద్రవ్యలోటు కట్టడికి కేంద్రానికి ఆర్బీఐ నిధులు అవసరం లేదు: అరుణ్ జైట్లీ స్పష్టీకరణ
- అదనపు వ్యయం బిల్లును ఆమోదించిన లోక్ సభ
- ద్రవ్యలోటు అదుపు చేయడంలో సమర్ధంగా పని చేశాం
- ఆర్బీఐ 28 శాతం రిజర్వ్ నిధులు కలిగి ఉంది
ఆ నిధులను పేదరిక నిర్మూలన కార్యక్రమాలను చేపట్టడానికి, ప్రభుత్వ రంగ బ్యాంకులకు నిధులు సమకూర్చడానికి వినియోగించాలనుకున్నామని చెప్పారు. ద్రవ్యలోటును అదుపులో ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేసిన రికార్డు ఉందని గుర్తుచేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కేంద్ర బ్యాంకులకు 8 శాతం రిజర్వ్ నిధులు ఉండగా, సంప్రదాయ దేశాల్లో మాత్రం అది 14 శాతంగా ఉందని చెప్పారు. కానీ, ఆర్బీఐ మాత్రం 28 శాతం రిజర్వ్ నిధులు కలిగి ఉందని, ఆ పరిమితిని నిపుణుల సంఘం త్వరలో నిర్ణయిస్తుందని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.