kcr: ఓ సీఎం మాట్లాడే భాషేనా అది?: కేసీఆర్ పై వీహెచ్ మండిపాటు

షార్ట్స్‌లో చూడండి
చంద్రబాబునాయుడిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను టీ-కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తప్పుబట్టారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిలా ప్రవర్తించడం లేదని, పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబునాయుడిపై ఆయన మాట్లాడిన భాష సరిగా లేదని విమర్శించారు. గ్రామాల్లో చదువు లేని వాళ్లు మాట్లాడే భాషలా కేసీఆర్ భాష ఉందని దుయ్యబట్టారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని దుర్భాషలాడటం సమంజసం కాదని, ఇలాంటి ముఖ్యమంత్రిని తానెక్కడా చూడలేదని వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
kcr
Chandrababu
vh
Andhra Pradesh
Telangana

More Telugu News