తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు!
- హోదా, విభజన హామీల అమలుపై విడుదల
- ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని మండిపాటు
- కేంద్రం అణగదొక్కేందుకు యత్నిస్తోందని ఆరోపణ
ఏపీకి సంబంధించిన విభజన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంలో చేరిస్తే, బీజేపీ దాన్ని అమలు చేయకుండా వేధించిందని చంద్రబాబు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చట్టంలో విభజన హామీలను చేర్చినప్పటికీ బీజేపీ అసలు చట్టాన్నే అమలు చేయకుండా వ్యవహరించిందని మండిపడ్డారు. గత నాలుగున్నరేళ్లలో బీజేపీ చేసిన నిర్వాకాన్ని బయటపెట్టేందుకే శ్వేతపత్రాన్ని తీసుకొచ్చామన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఏపీని అణగదొక్కేందుకు కేంద్రం యత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.