Balakrishna: బాలయ్యను చూస్తుంటే మళ్లీ ఎన్టీఆర్ ని చూస్తున్నట్టే ఉంది: అలనాటి నటి జమున

షార్ట్స్‌లో చూడండి
బాలయ్యను చూస్తుంటే మళ్లీ ఎన్టీఆర్ ని చూస్తున్నట్టే ఉందని అలనాటి నటి జమున అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, బాలకృష్ణను చిన్నప్పటి నుంచి తాము ‘బాలయ్య బాబు’ అని పిలిచే వాళ్లమని గుర్తుచేసుకున్నారు. బాలయ్య తండ్రిని మించిన తనయుడు కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.

ఎన్నో పాత్రలు పోషించిన ఎన్టీఆర్ ని ఈ బయోపిక్ ద్వారా బాలయ్య గుర్తుచేస్తుండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధిస్తుందని, ఎందుకంటే, విశ్వ వ్యాప్తంగా ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నటించిన గులేబకావళి కథ చిత్రంలోని ‘నన్ను దోచుకుందువటే..’ పాటను జమున ఆలపించడం.. బాలయ్య గొంతు కలపడంతో ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.
Go Back to Shorts
Balakrishna
NTR BioPIC
Jamuna

More Telugu News