తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మేకప్ మేన్ మృతి.. ఇంటికెళ్లి నివాళులర్పించిన తలైవా
- వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ముత్తప్ప
- శివాజీ గణేశన్, కమలహాసన్‌లకు కూడా ఆయనే మేకప్ మేన్
- సుదీర్ఘకాలం సేవలందించిన వైనం
గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ముత్తప్ప మంగళవారం మృతి చెందారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే రజనీకాంత్ సహా పలువురు స్టార్లు ఆయన ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. ఏవీఎం ముత్తప్పగా తమిళ చిత్ర పరిశ్రమలో చిరపరిచితులైన ముత్తప్ప 60 ఏళ్లపాటు మేకప్ మేన్‌గా పనిచేశారు. ఏవీఎం స్టూడియోలో సుదీర్ఘ కాలం పనిచేసిన తర్వాత రజనీకాంత్‌కు వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించారు.