అధికారంలోకి రానంత మాత్రాన మేము కుంగిపోం: ‘కాంగ్రెస్’ నేత భట్టి విక్రమార్క
- ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం
- అధికారం శాశ్వతం కాదు
- కేసీఆర్ అహంకారంతో మాట్లాడటం సరికాదు
అధికారంలోకి రానంత మాత్రాన తాము కుంగిపోమని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం శాశ్వతం అనుకోవడం వారి అమాయకత్వమని అన్నారు. ప్రతిపక్షాలపై అధికార పార్టీ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. కేసీఆర్ అహంకారంతో మాట్లాడటం సరికాదని, బెదిరించి, భయపెట్టి పాలన చేయాలనుకోవడం కరెక్టు కాదని అన్నారు. తాము అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన ఉంటామని హామీ ఇచ్చారు.