tirupathi: తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ

షార్ట్స్‌లో చూడండి
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి కనీసం 16 గంటల సమయం పడుతోంది. టైంస్లాట్‌ పొందిన వారికి కనీసం మూడు గంటల సమయం పడుతోంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం మొత్తం 24 కంప్లార్టమెంట్లలోనూ భక్తులు ఎదురు చూస్తున్నారు. భక్తులు పోటెత్తుతుండడంతో తిరుమల గిరులు భక్త జనంతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం వెంకన్నస్వామిని మొత్తం 72,957 మంది దర్శించుకోగా, హుండీ ద్వారా 2 కోట్ల 43 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Go Back to Shorts
tirupathi
srivenkateswara

More Telugu News