పీవీ సింధు బయోపిక్ లో సోనూసూద్
- నటుడిగా సోనూ సూద్ కి మంచి గుర్తింపు
- నిర్మాతగా పీవీ సింధు బయోపిక్ కి సన్నాహాలు
- కోచ్ పాత్రలో సోనూ సూద్
ఇక మరో వైపున బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్ ను నిర్మించడానికి సోనూసూద్ సిద్ధమవుతున్నాడు. తెలుగు.. తమిళ.. హిందీ భాషల్లో ప్రతినాయక పాత్రధారిగా సోనూసూద్ కి మంచి గుర్తింపు వుంది. పీవీ సింధు బయోపిక్ ను నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. పీవీ సింధు బాల్యం నుంచి ఒలంపిక్ మెడల్ సాధించేవరకూ ఈ కథ కొనసాగుతుంది. ప్రధానపాత్రను పోషించే నటి కోసం అన్వేషిస్తున్నారు. ఈ సినిమాలో పీవీ సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రను సోనూ సూద్ పోషించనుండటం విశేషం.