Tollywood: ‘మనకు పిల్లలు పుడితే నీలా ఉంటారా? నాలా ఉంటారా? అంటూ లవ్ ప్రపోజ్ చేశాడు’!: భర్త గురించి చెప్పిన ఖష్బూ

షార్ట్స్‌లో చూడండి
సినీరంగంలో, రాజకీయాల్లో ధైర్యంగా ముందుకు పోవడానికి తన భర్త సుందర్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ తెలిపారు. ఆయన మద్దతు లేకుంటే తాను అసలు రాజకీయాల్లోకి వచ్చేదాన్నే కాదని స్పష్టం చేశారు. అసలు తామిద్దరి మధ్య పరిచయం, ప్రేమ, పెళ్లి చాలా విచిత్రంగా జరిగాయని అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఓ సినిమా షూటింగ్ సందర్భంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఆమె తెలిపారు. హైదరాబాద్ లో ఓ మీడియా ఛానల్ కు సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడారు.

సుందర్ తొలి సినిమాకు పనిచేసేటప్పుడే తాను పెద్ద హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నానని ఖుష్బూ తెలిపారు. ‘ఆయన సినిమా షూటింగ్ సందర్భంగా నా దగ్గరకు వచ్చి.. ‘మేడం ఈ షాట్ రెడీగా ఉంది, మేడం ఆ షాట్ రెడీగా ఉంది’ అంటూ చెప్పేవారు. కానీ ఓరోజు  నా దగ్గరకు వచ్చి ‘నీకు-నాకు పిల్లలు పుడితే నీలా ఉంటారా? నాలా ఉంటారా? అని అడిగారన్నారు.

దీంతో నేను ఒక్కసారిగా షాక్ కు గురయ్యా. వెంటనే తేరుకుని..‘ఏం మాట్లాడుతున్నారు? నాకు ప్రపోజ్ చేయాలని చూస్తున్నారా? అని గట్టిగానే ప్రశ్నించా. అప్పుడు ఆయన నింపాదిగా..‘ఓ, అదంతా చేయాలా? నాకు నిజంగా తెలీదు. సరే.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగారు. అలా తన మొదటి సినిమా మొదలైన 20 రోజులకే పెళ్లి ప్రపోజల్ తెచ్చారు’’ అంటూ ఖష్బూ చెప్పారు.
Go Back to Shorts
Tollywood
kushboo
Talking Movies
marriage
love
propose
sundar

More Telugu News