చంద్రబాబు ఢిల్లీ టూర్.. వెటకారంగా స్పందించిన విజయసాయిరెడ్డి!
- టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న బాబు
- జాతీయ నేతలతో వ్యూహాత్మక భేటీ
- ఫన్నీ మెమెను పోస్ట్ చేసిన వైసీపీ నేత
గతంలో కేంద్రంపై పోరాటం చేస్తానని వెళ్లిన చంద్రబాబు ఢిల్లీలో మోదీతో నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అలాగే చంద్రబాబు పార్లమెంటు మెట్లకు దండం పెడుతున్న మరో ఫొటోను పంచుకున్నారు. ఈ మెమెకు ‘గతంలో ఢీ కొట్టినప్పుడు మనం చూసిన భీకర దృశ్యాలు’ అంటూ వెటకారంగా క్యాప్షన్ ఇచ్చారు.