సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కీర్తి
- రజనీ చిత్రానికి అనిరుధ్ సంగీతం
- మరో హిందీ చిత్రంలో దుల్కర్
* తాజాగా 'రోబో' సీక్వెల్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని మురుగదాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. మార్చి నుంచి షూటింగ్ జరుపుకునే ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తాడు.
* హిందీలో కూడా సినిమాలు చేస్తున్న మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తాజాగా కరణ్ జొహార్ సినిమాలో నటించడానికి ఎంపికయ్యాడు. జాహ్నవి కపూర్ హీరోయిన్ గా కరణ్ నిర్మిస్తున్న బయోపిక్ లో దుల్కర్ హీరోగా నటించనున్నాడు.