KCR: కేసీఆర్‌కు దొరతనంతో పాటు దోపిడీతనం కూడా తోడైంది: గద్దర్

దొరల గడీల్లో న్యాయం నలిగిపోయిందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఓ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌కు దొరతనంతో పాటు దోపిడీతనం కూడా తోడైందని ధ్వజమెత్తారు. ఆయనకసలు కృతజ్ఞతాభావమే లేదన్నారు. మోదీ, కేసీఆర్ చీకటి ఒప్పందం కారణంగానే ముందస్తు ఎన్నికలు వచ్చాయని గద్దర్ ఆరోపించారు.

మోదీ, కేసీఆర్‌ రహస్య కూటమి ఒక వైపు, ప్రజలు మరో వైపున్నారు కాబట్టే ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీలతో కలిసి పని చేస్తున్నానన్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో కానీ... సచివాలయంలో కానీ దొరకడని ఆరోపించారు. గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్లు నెరవేర్చలేదని, దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఆ మాట కూడా తప్పారని గద్దర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KCR
Modi
Gaddar
Elections

More Telugu News