kcr: కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది!: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికలలో ఓడిపోతాననే భయం కేసీఆర్ కు పట్టుకుందని చంద్రబాబు అన్నారు. ఓ విజన్ తో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని... టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

తాను మళ్లీ ఇక్కడకు రాలేనని చెప్పారు. తెలంగాణలో మంచి ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షించారు. పార్టీ మారిన వారంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. ప్రధాని అయ్యే అవకాశం గతంలో తనకు వచ్చిందని... కానీ, రాష్ట్ర కోసం తాను ఇక్కడే ఉండిపోయానని చెప్పారు. ప్రజాకూటమి అభ్యర్థి గణేష్ గుప్తా తరపున మణికొండలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, పైవ్యాఖ్యలు చేశారు. 
Go Back to Shorts
kcr
Chandrababu
TRS
Telugudesam

More Telugu News