‘తెలంగాణ’లో బీజేపీకి నాలుగు సీట్లన్నా వస్తాయా?: మంత్రి హరీశ్ రావు సెటైర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘తెలంగాణ’లో బీజేపీకి నాలుగు సీట్లన్నా వస్తాయా?: మంత్రి హరీశ్ రావు సెటైర్లు

  • బీజేపీ గెలిచే పార్టీ కాదు
  • రూపాయి పని కూడా చేసే పార్టీ కాదు
  • వచ్చే వర్షాకాలానికి దుబ్బాకకు గోదావరి నీళ్లు ఖాయం
‘తెలంగాణ’లో బీజేపీకి నాలుగు సీట్లన్నా వస్తాయా? అంటూ మంత్రి హరీశ్ రావు సెటైర్లు విసిరారు. సిద్దిపేటలోని దుబ్బాకలో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, బీజేపీ గెలిచే పార్టీ కాదని, రూపాయి పని కూడా చేసే పార్టీ కాదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణకు ఎటువంటి మేలు జరగలేదని, విద్యుత్ కోసం ధర్నాలు చేశారని, అదే, టీఆర్ఎస్ హయాంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారని, వచ్చే వర్షాకాలం నాటికి దుబ్బాకకు గోదావరి నీళ్లు రావడం ఖాయమని చెప్పారు. రైతు బీమా పథకంలో రైతులకు భరోసా కల్పించామని, తాము అధికారంలోకొస్తే రైతుబంధు పథకం కింద ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. 
Telangana
TRS
dubbaka
Harish Rao

More Telugu News