ప్రియాంక, నిక్ జంట పెళ్లి సంరంభం.. అతిథులకు ఇవ్వాల్సిన కానుకలు రెడీ!
- 2, 3 తేదీల్లో ప్రియాంక, నిక్‌ల పెళ్లి
- ముంబైకి చేరుకున్న నిక్
- ప్రియాంక నివాసంలో ముగిసిన పూజ
- అతిథులకు కానుకగా వెండి నాణేలు
నేడు ప్రియాంక నివాసంలో పూజ నిర్వహించినట్టు సమాచారం. గురువారం ప్యాలెస్‌లో మెహందీ, సంగీత్, శుక్రవారం పార్టీ, శనివారం పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడికి పసుపు రాసే కార్యక్రమం నిర్వహించనున్నారని సమాచారం. ఇక కాబోయే వధూవరులు ఇప్పటికే అతిథులకు ఇవ్వాల్సిన కానుకల్ని ప్రత్యేకంగా సిద్ధం చేయించారట. వీరు వెండి నాణేలను బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ వెండి నాణేలపై ఒకవైపు ‘ఎన్‌పీ’(నిక్, ప్రియాంక) అని రాసి ఉండగా మరోవైపు గణేష్, లక్ష్మీదేవి ప్రతిమలను పొందుపరిచారట. ప్రస్తుతం ఈ వెండి నాణేలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.