వెంకన్న చెంత ముఖేష్ అంబానీ... స్వామి పాదాల చెంత ఇషా వివాహ ఆహ్వాన పత్రిక!
- అర్చన సేవలో పాల్గొన్న ముఖేష్ అంబానీ
- వెంట కుమారుడు అనంత్ అంబానీ కూడా
- ఆశీర్వచనం పలికి శేషవస్త్రాన్ని బహూకరించిన అర్చకులు
ముఖేష్ ఫ్యామిలీకి స్వాగతం పలికిన ఆలయ అధికారులు, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ముఖేష్, అనంత్ లకు వేదాశీర్వచనం పలికి స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించి, తీర్థప్రసాదాలను అందించారు. వెంకటేశ్వరునిపై అమిత భక్తి ప్రపత్తులున్న ముఖేష్ అంబానీ, తన ఇంట ఏ శుభకార్యం తలపెట్టినా స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారన్న సంగతి తెలిసిందే.