కేసీఆర్ ను ఓడించాలని.. వంటేరుతో హరీష్ రావు చర్చలు జరిపారు: రేవంత్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ ను ఓడించాలని.. వంటేరుతో హరీష్ రావు చర్చలు జరిపారు: రేవంత్ రెడ్డి

  • కేసీఆర్, కేటీఆర్ ఓడిపోవాలని హరీష్ రావు ఆశిస్తున్నారు
  • ఇద్దరూ ఓడిపోతే టీఆర్ఎస్ పగ్గాలు తన చేతిలోకి వస్తాయని భావిస్తున్నారు
  • కార్మికుల పేదరికాన్ని కూడా కమిషన్లకు ఉపయోగించుకునే వ్యక్తి కేటీఆర్
మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ నేత హరీష్ రావు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఓడిపోవాలని హరీష్ కోరుకుంటున్నారని చెప్పారు. వారిద్దరూ ఓడిపోతే టీఆర్ఎస్ పగ్గాలు తన చేతిలోకి వస్తాయని హరీష్ భావిస్తున్నారని... అందుకే కేసీఆర్ ఫాంహౌస్ కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లిపోవాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ ను ఓడించాలని వంటేరు ప్రతాపరెడ్డితో హరీష్ చర్చలు జరిపారని అన్నారు. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో ప్రసంగిస్తూ రేవంత్ పైవ్యాఖ్యలు చేశారు.

బతుకమ్మ చీరలు సిరిసిల్లలో కాకుండా సూరత్ లో కొనుగోలు చేశారని రేవంత్ ఎద్దేవా చేశారు. నేరెళ్లలో ఇసుక మాఫియాకు ఎదురు తిరిగిన ఎస్సీలను హింసించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలు ఆగలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని... టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని దుయ్యబట్టారు. తెలంగాణ పరిస్థితిని చూసి సోనియాగాంధీ తన కన్నీళ్లను కళ్లలోనే దాచుకున్నారని చెప్పారు. కార్మికుల పేదరికాన్ని కూడా కమిషన్లకు ఉపయోగించుకునే వ్యక్తి కేటీఆర్ అని మండిపడ్డారు. 
kcr
KTR
Harish Rao
Revanth Reddy
vanteru pratap reddy
TRS
congress

More Telugu News