balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక

షార్ట్స్‌లో చూడండి
తమిళంలో అగ్రకథానాయికగా హన్సిక ఒక రేంజ్ లో దూసుకెళ్లింది. అక్కడ చాలా బిజీగా ఉండటం వల్లనే ఈ సుందరి తెలుగు సినిమాలను పెద్దగా చేయలేకపోయింది. ఇక ఇప్పుడు తమిళంలో హన్సికకి అవకాశాలు చాలా వరకూ తగ్గాయి. అందువలన ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమెకి ఎన్టీఆర్ బయోపిక్ లో ఛాన్స్ వచ్చినట్టుగా సమాచారం.

జయప్రద పాత్ర కోసం హన్సికను టెస్ట్ చేసిన క్రిష్ .. ఆమెను ఓకే చేశాడని చెబుతున్నారు. ఇంతకుముందు జయప్రద పాత్ర కోసం తమన్నాను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో తెలియదు గానీ, ఆ పాత్రకు హన్సికను ఫిక్స్ చేసేశారని అంటున్నారు. ఇప్పటికే శ్రీదేవిగా రకుల్ .. సావిత్రిగా నిత్యామీనన్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక జయసుధ పాత్ర కోసం పాయల్ రాజ్ పుత్ పేరు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. జనవరి 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  
Go Back to Shorts
balakrishna
hansika

More Telugu News