టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ఆలోచించుకోవాలి!: ప్రకాశ్ రాజ్ చురక
Add ap7am to your home Screen

టీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ఆలోచించుకోవాలి!: ప్రకాశ్ రాజ్ చురక

  • 15 సీట్లతో చంద్రబాబు సీఎం అయిపోతారా?
  • టీఆర్ఎస్ నెగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉంది 
  • నాకు సిద్ద రామయ్య అంటే ఎంతో ఇష్టం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపైనా, తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలపైనా ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని అయితే, టీఆర్ఎస్ వెళ్లి ఏపీలో పోటీ చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ఆలోచించుకోవాలని అన్నారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని స్పష్టం చేసిన ప్రకాశ్ రాజ్.. కేసీఆర్ చెప్పినట్టు ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నవి కబడ్డీ మ్యాచ్‌లు కావని కోట్లాదిమందికి ఎంతో ముఖ్యమైన ఎన్నికలని పేర్కొన్నారు. ప్రజలు ఎప్పుడూ ప్రేక్షకులుగా మిగిలిపోకూడదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు కేసీఆర్ తప్ప మరో ప్రయత్యామ్నాం లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నెగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలతో సంబంధం లేకుండా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రం గురించి ఆలోచించి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు గొప్ప నాయకుడని ప్రకాశ్ రాజ్ ప్రశంసించారు. అయితే, తెలంగాణకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు 15 సీట్లతో ముఖ్యమంత్రి అవుతారా? అని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం వస్తే ఎటువైపు మొగ్గుచూపుతారని ప్రశ్నించాలన్నారు. ఇక, తనకు కాంగ్రెస్ అంటే ఇష్టమని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య తన ఫేవరెట్ నాయకుడని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
Prakash Raj
Telangana
Andhra Pradesh
KCR
Chandrababu

More Telugu News