సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పాటకు 60 లక్షలు అడిగిన ఇలియానా
  •  మరో సీక్వెల్ కూడా చేస్తానంటున్న దర్శకుడు 
  • జనవరి నుంచి హరీష్ శంకర్ సినిమా
*  గోవా బ్యూటీ ఇలియానా ఒక ఐటెం పాట చేయడానికి 60 లక్షలు అడిగిందట. రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'వినయ విధేయ రామ' చిత్రంలో స్పెషల్ సాంగు చేయడానికి నిర్మాతలు ఇలియానాను సంప్రదించగా అరవై లక్షలు అడిగిందట. దాంతో నిర్మాతలు వేరే నటి కోసం చూస్తున్నట్టు సమాచారం.
*  తమిళ దర్శకుడు శంకర్ సీక్వెల్స్ పట్ల ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే 'రోబో' సీక్వెల్ గా '2.ఓ' చిత్రాన్ని రూపొందించిన ఆయన, తాజాగా 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో వున్నాడు. ఇదే సమయంలో గతంలో తాను తీసిన 'ఒకే ఒక్కడు' చిత్రానికి కూడా సీక్వెల్ చేస్తానని ప్రకటించాడు. స్టార్ హీరో విజయ్ తో ఈ సీక్వెల్ చేయాలని వుందని శంకర్ చెప్పాడు.
*  గతంలో తమిళంలో వచ్చిన 'జిగర్తాండ' చిత్రాన్ని హరీష్ శంకర్ తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. రాం ఆచంట, గోపి ఆచంట నిర్మించే ఈ చిత్రం షూటింగ్ జనవరి నుంచి జరుగుతుంది. ఇందులో హీరో పాత్రకు ఇంకా ఎవరూ ఎంపిక కాలేదు. అయితే, విలన్ పాత్రకు మాత్రం వరుణ్ తేజ్ ను సంప్రదిస్తున్నారట.
Ileana
shankar
varuntej
harish

More Telugu News