అయోధ్యలో రేపు వీహెచ్‌పీ, శివసేన ర్యాలీ, సభ.. టెన్షన్ టెన్షన్!
- వివాదాస్పద ప్రాంతంలో రాముడి మందిరం నిర్మించాలని రెండు పక్షాల డిమాండ్
- ఐదు ప్రత్యేక రైళ్లలో భారీగా తరలి వస్తున్న జనం
- కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు
ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ ధర్మ సభ నిర్వహిస్తుండడం, ఈ సభకు లక్షలాది మంది తరలి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. వీహెచ్‌పీ సభకు దాదాపు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వీహెచ్‌పీతోపాటు శివసేన కలిసి ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. ఈ కార్యకమ్రానికి శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే కూడా హాజరవుతున్నారు. సరయూ నదిలో జరిగే హారతి కార్యక్రమంలో ఉద్దవ్ పాల్గొంటారు.