న్యూఢిల్లీలోకి చొరబడిన ఇద్దరు టెర్రరిస్టులు... ఫోటో విడుదల చేసిన పోలీసులు!
- ఆనవాళ్లు కనిపిస్తే పోలీసులకు ఫోన్ చేయండి
- నల్లటి కుర్తాలతో ఉన్న యువకుల చిత్రం విడుదల
- హెచ్చరించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు
కాగా, ఈ ఫోటోలో ఢిల్లీకి 360 కిలోమీటర్లు, ఫిరోజ్ పూర్ కు 9 కిలోమీటర్ల దూరం ఉన్న ఓ మైలురాయి వద్ద ఇద్దరు నల్లటి కుర్తాలు ధరించిన యువకులు ఉన్నారు. ఫిరోజ్ పూర్ పట్టణం పంజాబ్ లోని ఇండియా - పాకిస్థాన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఈ ప్రకటన చేశారు. కాగా, గత వారంలో జైషే మొహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులు ఢిల్లీ దిశగా కదులుతున్నట్టు సమాచారం అందుతోందని పంజాబ్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.