అదే నాకు వచ్చిన ఫస్టు లవ్ లెటర్: కీర్తి సురేశ్
Add ap7am to your home Screen

అదే నాకు వచ్చిన ఫస్టు లవ్ లెటర్: కీర్తి సురేశ్

  • ఒకసారి షాపు ఓపెనింగ్ కి వెళ్లాను 
  • ఒక యువకుడు వచ్చి బుక్ ఇచ్చాడు 
  • కాలేజ్ రోజుల్లో ఎవరూ లవ్ లెటర్ ఇవ్వలేదు 
అందం .. అభినయం కలగలిసిన రూపంగా కీర్తి సురేశ్ కనిపిస్తుంది. తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె జెమినీ టీవీలో రానా హోస్ట్ గా వ్యవహరిస్తోన్న 'నెం.1యారీ' కార్యక్రమంలో పాల్గొంది. తన జీవితంలో తనకి హఠాత్తుగా ఎదురైన ఒక సంఘటనను గురించి ఆమె ప్రస్తావిస్తూ .. "ఒకసారి నేను ఒక జ్యుయలరీ షాపు ఓపెనింగ్ కి వెళ్లాను. ఆ సమయంలో ఒక యువకుడు హఠాత్తుగా నా దగ్గరికి వచ్చి నాకు ఒక బుక్ ఇచ్చేసి వెళ్లిపోయాడు.

 గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడని అనుకున్నాను. ఆ తరువాత బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో నావి కొన్ని ఫోటోలు వున్నాయి. వాటితో పాటు ఒక లవ్ లెటర్ కూడా వుంది. నన్ను ప్రేమిస్తున్నాననీ .. పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు రాశాడు. అతని ఫోటోపై వివరాలు కూడా రాశాడు. అదే నా లైఫ్ లో నాకు వచ్చిన ఫస్టు లవ్ లెటర్ .. కాలేజ్ రోజుల్లో మాత్రం ఎవరూ ఇవ్వలేదు" అంటూ కీర్తి సురేశ్ నవ్వేసింది. 
keerthi suresh

More Telugu News