కన్నీరుపెట్టిన కాంగ్రెస్ నేత ముత్యంరెడ్డి.. సముదాయించిన మంత్రి హరీశ్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కన్నీరుపెట్టిన కాంగ్రెస్ నేత ముత్యంరెడ్డి.. సముదాయించిన మంత్రి హరీశ్ రావు

  • టికెట్ దక్కని దుబ్బాక కాంగ్రెస్ నేత ముత్యంరెడ్డి
  • టీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన హరీశ్ రావు
  • సానుకూలంగా స్పందించిన ముత్యంరెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ముత్యంరెడ్డిని టీఆర్ఎస్ లో చేరాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆహ్వానించారు. తొగుటలోని ముత్యంరెడ్డి నివాసానికి హరీశ్ రావు వెళ్లారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ పార్టీ తనకు ద్రోహం చేసిందని, తనను దూరం పెట్టిందంటూ వాపోయారు.

ముత్యంరెడ్డిని ఓదార్చిన హరీశ్ రావు మాట్లాడుతూ, సీనియర్ నాయకులు కంటతడి పెట్టొద్దంటూ ఆయన్ని సముదాయించారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందింది కేవలం ముత్యంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కృషి వల్లేనని అన్నారు. టీఆర్ఎస్ లో చేరేందుకు ముత్యంరెడ్డి సానుకూలంగా స్పందించారని, 20వ తేదీన సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారని స్పష్టం చేశారు. కాగా, ముత్యంరెడ్డి మాట్లాడుతూ, తనకు తప్పు చేయడం, లంచాలు తీసుకోవడం తెలియదని, ఈ ఎన్నికల్లో తనను కాంగ్రెస్ పార్టీ ఎందుకు దూరంగా పెట్టిందో అర్థం కావట్లేదని అన్నారు.
t-congress
TRS
harish reddy
mutyam reddy

More Telugu News