రేప్‌లేమైనా కొత్తా? అప్పుడూ జరిగాయి.. ఇప్పుడూ జరుగుతున్నాయి: హరియాణా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
- రేప్‌లు అప్పుడూ ఉన్నాయి.. ఇప్పుడూ ఉన్నాయి
- ఆందోళన మాత్రమే ఎక్కువైంది
- నిందితులు, బాధితులు ఇద్దరూ ఒకరికొకరు తెలిసినవారే
80-90 శాతం రేప్ కేసులు కేవలం ఈవ్ టీజింగ్ మాత్రమేనన్నారు. బాధితులు, నిందితులు ఇద్దరూ పరస్పరం ఒకిరికి ఒకరు తెలిసినవారే ఉంటారన్నారు. చాలా కాలంగా వారి మధ్య కొనసాగుతున్న బంధం బీటలు వారినప్పుడు.. ‘అతడు నన్ను రేప్ చేశాడంటూ’ ఆమె కేసు పెడుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మహిళలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలకు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు నిదర్శనమని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మండిపడ్డారు. అత్యాచారాలు, గ్యాంగ్ రేప్‌లను అడ్డుకోవడం చేతకాని ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు.