సీబీఐ కేసుపై ‘సుప్రీం’లో విచారణ.. అలోక్ వర్మకు సీల్డ్ కవర్ లో సీవీసీ నివేదిక కాపీ
- అలోక్ వర్మ సోమవారంలోగా స్పందించాలి
- దీనిపై స్పందనను సీల్డ్ కవర్ ద్వారా వర్మ అందజేయాలి
- ప్రధాన న్యాయమూర్తి గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం
ఈ నివేదిక ద్వారా పలు అభిప్రాయాలు వెలిబుచ్చిందని, వాటిలో కొన్ని అంశాలపై ఇంకా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. అలోక్ వర్మ తన సమాధానం ఇచ్చిన అనంతరం తదుపరి విచారణ మంగళవారం జరుపుతామని, ఈ నివేదికను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలకు కూడా అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉండగా, సీవీసీ నివేదికను తనకు కూడా ఇవ్వాలన్న రాకేశ్ ఆస్థానా అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.