హెరిటేజ్ పాల సొమ్మును చంద్రబాబు ఖర్చు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు!: బీజేపీ నేత జీవీఎల్
- సీఎం నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారు
- మహారాజులా సొమ్మును వెదజల్లుతున్నారు
- అధికారులు చివరికి బలిపశువులు అవుతారు
హెరిటేజ్ పాల వ్యాపారంలో సంపాదించుకున్న మొత్తాన్ని చంద్రబాబు ఖర్చు పెట్టుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. ఇలాంటి విచ్చలవిడి విన్యాసాలకు అనుమతులు ఇస్తున్న అధికారులు చివరికి బాధ్యులుగా నిలుస్తారని హెచ్చరించారు. చంద్రబాబు కోసం ఇష్టానుసారం అనుమతులు ఇచ్చే అధికారుల పెన్షన్లు, ప్రావిడెంట్ ఫండ్లపై ఆంక్షలు విధించే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు విచ్చలవిడి ప్రజాధన దుర్వినియోగంపై అవసరమైతే హైకోర్టుకు వెళతామని చెప్పారు.