చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన స్టాలిన్, కనిమొళి

  • విమానాశ్రయం నుంచి నేరుగా స్టాలిన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు
  • సాదరంగా ఆహ్వానించిన స్టాలిన్, కనిమొళి, సీనియర్ నేతలు
  • భవిష్యత్ కార్యాచరణపై చర్చ
డీఎంకే అధినేత స్టాలిన్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. మహాకూటమి ఏర్పాటులో భాగంగా చర్చించేందుకు చెన్నై వెళ్లిన చంద్రబాబు... విమానాశ్రయం నుంచి నేరుగా స్టాలిన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్టాలిన్, కనిమొళితో పాటు డీఎంకే సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరంతా భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
Go Back to Shorts
Chandrababu
chennai
stalin
kanimozhi
Telugudesam
dmk

More Telugu News