డ్యూటీలో ఉన్న ఎస్ఐని వాహనంతో తొక్కించి చంపిన మద్యం మాఫియా
- మహారాష్ట్రలో ఘటన
- తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృతి చెందిన ఎస్సై
- నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
వాహనం దగ్గరికి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా ఎస్‌యూవీ డ్రైవర్ అకస్మాత్తుగా వాహనాన్ని వెనక్కి తిప్పి చత్రపతి చిడేపై ఎక్కించాడు. వెనక చక్రాల కింద నలిగిపోయి తీవ్ర గాయాలపాలైన చిడేను వెంటనే బ్రహ్మపురి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిడే మృతి చెందారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్‌యూవీ, దాని డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.