Sabarimala: శబరిమలకు వచ్చిన మహిళ, భారీ తోపులాట, కెమెరామెన్ కు గాయాలు, ఉద్రిక్తత!
- ఆలయానికి వచ్చిన 52 ఏళ్ల మహిళ
- 50 ఏళ్ల లోపేనన్న అనుమానంతో అడ్డుకున్న నిరసనకారులు
- ఆలయం వద్ద తోపులాట
అయ్యప్పను దర్శించుకునేందుకు ఈ ఉదయం ఓ మహిళ రాగా, ఆమె వయసు 50 సంవత్సరాలలోపే ఉందని భావించిన భక్తులు, తీవ్ర స్థాయిలో నినాదాలు చేస్తూ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో, ఆలయం వద్ద భారీ తోపులాట జరిగింది. ఈ ఘటనలో 'అమృత' టీవీ చానల్ కెమెరామెన్ బిజూకు గాయాలు అయ్యాయి.
ఆమె తన వయసు 52 ఏళ్లని, తన కుమారుడితో కలసి స్వామి దర్శనానికి వచ్చానని చెప్పగా, నిరసనకారులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు వినకపోవడంతో, ఆ మహిళను తమ అదుపులోకి తీసుకున్నారు. చిత్తిరాత్త తిరుణాల్ నేపథ్యంలో ఆలయాన్ని నిన్న తెరిచిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో శబరిమలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.