కేసీఆర్ దెబ్బకొడితే కాంగ్రెస్, టీడీపీ మైండ్ బ్లాంక్ అవుతుంది: హరీశ్‌రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ దెబ్బకొడితే కాంగ్రెస్, టీడీపీ మైండ్ బ్లాంక్ అవుతుంది: హరీశ్‌రావు

  • అభివృద్ధికి, అవకాశవాదానికి మధ్యే ఎన్నికలు
  • ఎవరికి ఓటు వెయ్యాలో తేల్చుకోవాలి
  • ఏపీలో చంద్రబాబు భృతి ఎందుకు ఇవ్వట్లేదు
కాంగ్రెస్‌కు నోట్ల కట్టలు, టికెట్లు, మాట్లాడాల్సిన స్క్రిప్ట్.. అంతా అమరావతి నుంచే వస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హారీశ్‌రావు ఆరోపించారు. నేడు ఆయన గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ కార్మిక విభాగం నిర్వహించిన ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ దెబ్బకొడితే కాంగ్రెస్, టీడీపీ మైండ్ బ్లాంక్ అవుతుందన్నారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే చంద్రబాబుతో ప్రచారం చేయించాలని హరీశ్ రావు సవాల్ విసిరారు.

రూపాయి కూడా ఇవ్వని కాంగ్రెస్‌కు ఓటెయ్యాలో లేదంటే పెన్షన్ ఇచ్చే టీఆర్ఎస్‌కు ఓటు వెయ్యాలో తేల్చుకోవాలన్నారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికలు అభివృద్ధికి, అవకాశవాదానికి మధ్యేనని పేర్కొన్నారు. చంద్రబాబు ఏపీలో కార్మికులకు భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను రూ.2,500 కోట్లతో అభివృద్ధి చేశారని తెలిపారు.
Congress
Chandrababu
Harish Rao
Gajwel
Telangana
KCR

More Telugu News