చంద్రబాబు రాజకీయ విధానం ఇదే.. ట్విట్టర్ లో నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్!
- అవకాశవాద రాజకీయాలు ఆయన నైజం
- దాన్ని ఓ ఆచారంగా మార్చుకున్నారు
- ప్రతిపక్ష నేతపై దాడి విషయంలో వెకిలి నవ్వులా?
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరగడం దురదృష్టకరమని పవన్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దాడి అంశంపై సరైన రీతిలో స్పందించాల్సిన చంద్రబాబు... వెకిలిగా నవ్వుతూ మాట్లాడుతుండటం దారుణమని చెప్పారు. దాడి ఘటనను లోతుగా విచారించాలన్నారు. కావాలని నిందితుడు దాడి చేశాడా? లేక ఇతరుల ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారించాలని డిమాండ్ చేశారు.