నా కొడుక్కి వైకాపాతో సంబంధాలు లేవు: శ్రీనివాసరావు తల్లిదండ్రులు
- ఆ పార్టీ నేతలతో పరిచయాలు కూడా లేవు
- అసలు వాడు ఊరిలో సరిగ్గా ఉండేవాడు కాదు
- సిట్ విచారణలో తాతారావు, సావిత్రమ్మ
తమ బిడ్డ ఊరిలో సరిగ్గా ఉండేవాడు కాదని వారు విచారణలో చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏ రాజకీయ పార్టీతో తిరిగేవాడు? చురుకుగా ఉండేవాడా? వంటి ప్రశ్నలను సంధించిన సిట్ అధికారులు వారితో సమాధానాలు చెప్పించారు. ముమ్మడివరంలోని ఠానేలంక నుంచి సావిత్రమ్మ, తాతారావులను బుధవారం రాత్రి విశాఖకు తీసుకువచ్చిన అధికారులు, నిన్నంతా వారిని స్టేషన్ లోనే ఉంచి విచారించారు.