Chandrababu: చంద్రబాబుకు రాహుల్ ఏం హామీ ఇచ్చారో చెప్పాలి: ఎంపీ వినోద్

షార్ట్స్‌లో చూడండి
చంద్రబాబుకు రాహుల్ గాంధీ ఏం హామీ ఇచ్చారో స్పష్టం చేయాలని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పన్ను మినహాయింపులు కూడా ఉంటాయో లేదో రాహుల్ చెప్పాలని  డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందని, కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపెట్టుకోవడమంటే తెలుగువారిని అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ, చంద్రబాబుల మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయో ఎవరికీ తెలియదన్నారు.

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుండగా ఏపీ ప్రజలను టీడీపీ మోసం చేస్తోందని వినోద్ విమర్శించారు. కాంగ్రెస్‌కు ఢిల్లీలో బాస్‌లు ఉన్నారని, ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా ఢిల్లీకి గులాంలు అయ్యారని తీవ్రంగా విమర్శించారు. ఒకప్పుడు టీడీపీ టిక్కెట్లు హైదరాబాద్‌లో ఇచ్చేవారని, ప్రస్తుతం ఢిల్లీలో ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వినోద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Vinod
TRS

More Telugu News