KTR: పొత్తులు పెట్టుకోమని ఏ అమరులు కోరుతున్నారో కోదండరాం వెల్లడించాలి: కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేటలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ సభలో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ప్రతిపక్షాలు జట్టుకట్టి అనైతిక పొత్తులు పెట్టుకున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబుతో కాంగ్రెస్ జత కట్టిందన్నారు. అమరుల ఆకాంక్షల మేరకు పొత్తులు అని కోదండరాం అంటున్నారని, పొత్తులు పెట్టకోమని ఆయనను ఏ అమరులు కోరుతున్నారో వెల్లడించాలని కేటీఆర్ అన్నారు.

కేసీఆర్ పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడని, కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని అనుకుంటున్నారని కేటీఆర్ కొనియాడారు. మహాకూటమికి ఓటేస్తే మన మరణశాసనం మనం రాసుకున్నట్టేనని విమర్శించారు. ఈ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు చేతిలో జుట్టుపెట్టి తెలంగాణకు ఏం చేయగలుగుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఆషామాషీగా ఓటు వెయ్యెద్దని, ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయండని ప్రజలకు సూచించారు. తెలంగాణ కోసం అప్పుడైనా.. ఇప్పుడైనా.. ఎప్పటికైనా నిలబడేది ఒక్క టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని కేటీఆర్ అన్నారు.
Go Back to Shorts
KTR
TRS
Telangana

More Telugu News