ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి జగన్ మోడీ రెడ్డి తప్ప మరొకరుండరు: లోకేశ్
- మీరు మారరు.. మీ నాయకుడు మారరు
- వైసీపీ ట్రేడ్ మార్క్ మార్ఫింగ్ ట్రిక్స్
- చీప్ ఫోటోషాప్ గిమ్మిక్కులు
ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో వైసీపీపై లోకేశ్ ధ్వజమెత్తారు. ‘‘వైసీపీ ట్రేడ్ మార్క్ మార్ఫింగ్ ట్రిక్స్. దాడి చేసింది తన అభిమానే అని ఒప్పుకునే ధైర్యం లేని నాయకుడు జగన్ మోడీ రెడ్డి. తన అభిమానిని టీడీపీ కార్యకర్తగా చిత్రిస్తూ చీప్ ఫోటో షాప్ గిమ్మిక్కులు. కనీస అవగాహన కూడా లేకుండా ముమ్మిడివరం మండలం అమలాపురం నియోజకవర్గంలోనిది అంటూ ఫేక్ మెంబెర్ షిప్ కార్డ్ తయారు చేశారు. ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి జగన్ మోడీ రెడ్డి తప్ప మరొకరు ఉండరు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.