శబరిమలపై సుప్రీం తీర్పును వెనకేసుకొచ్చిన సందీపానందగిరి ఆశ్రమం సర్వనాశనం!
- ఈ తెల్లవారుజామున ఘటన
- ఆశ్రమంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు
- శిక్ష తప్పదని హెచ్చరించిన పినరయి విజయన్
2.30 గంటల సమయంలో నిరసనకారులు ఆశ్రమంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్రమాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనే సందీపానంద గిరికి పలువురి నుంచి హెచ్చరికలు, బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది.
కాగా, ఈ దాడిపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్, భౌతిక దాడులతో ఆలోచనలను, సమాజంలో జరిగే మార్పులను మార్చలేమని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకే తీసుకునే అధికారాన్ని ఎవరికీ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఆశ్రమంపై దాడి చేసిన వారికి శిక్ష తప్పదని చెప్పారు.