జగన్ పచ్చినెత్తురు తాగే వ్యక్తి.. వైఎస్ రాజారెడ్డిలా చంద్రబాబు అన్నం పెట్టినవారిని చంపలేదు!: కేశినేని నాని
- ఏపీలో జగన్నాటకం జరుగుతోంది
- మీలా రాజకీయ హత్యలు చేయలేదు
- ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర
కొడుకు వైఎస్ రాజకీయ ప్రస్థానం కోసం రాజారెడ్డిలా చంద్రబాబు ఎన్నడూ రాజకీయ హత్యలు చేయించలేదని స్పష్టం చేశారు. ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. ఈ రోజు పలు ఆర్థిక నేరాల్లో సైతం ప్రతిపక్ష నేత జగన్ పేరు వస్తోందని కేశినేని నాని తెలిపారు.
ఇలాంటి సందర్భాల్లో ఏ-1గా చంద్రబాబు పేరు ఉండాలా? లేక రాజశేఖరరెడ్డి కుటుంబం పేరు ఉండాలా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పచ్చినెత్తురు తాగే వ్యక్తి అని విమర్శించారు. బీజేపీతో కుమ్మక్కయిన వైసీపీ నేతలు టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.